
సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల కోసం 12 జన్‌సాధారణ్ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. విజయవాడ- విశాఖపట్నం మార్గంలో ఇవి సేవలు అందిస్తాయి. జనవరి 15వ తేదీ మినహా జనవరి 12 నుంచి జనవరి18వ తేదీ వరకూ ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. విశాఖపట్నం నుంచి ఉదయం పది గంటలకు బయల్దేరి సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ చేరుకుంటుంది. అలాగే విజయవాడ నుంచి సాయంత్రం ఆరున్నర గంటలకు బయల్దేరితే రాత్రి 12 గంటల 35 నిమిషాలకు విశాఖ చేరుకుంటుంది.





